Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అసెంబ్లీ తీర్మానం ఎలా ఉన్నా పార్లమెంటులో బిల్లు: కాంగ్రెస్

తెలంగాణపై ఓ భారం వదిలించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇక తదనంతర పరిణామాలపై దృష్టి సారించింది. అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం ప్రవేశపెడతామని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. అయితే, ఆ తీర్మానం ఎలా ఉన్నా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతామని ఆయన స్పష్టం చేశారు. న్యాయశాఖ ఈ బిల్లుకు రూపకల్పన చేస్తుందని ఆయన వెల్లడించారు. వచ్చే పదేళ్ళపాటు సీమాంధ్ర పాలన హైదరాబాదు నుంచే సాగుతుందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.

More Telugu News